మూడోసారి సీబీఐ విచారణ హాజరైన వివేకా కూతురు

వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 14వ రోజు కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో జరుగుతున్న విచారణకు వివేకా వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి, పనిమనిషి లక్ష్మీదేవి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఇనాయ్‌ తుల్లా శుక్రవారం హాజరయ్యారు.

వివేకా కుమార్తె సునీత కూడా విచారణకు హాజరయ్యారు. సునీతను సీబీఐ అధికారులు ప్రశ్నించడం ఇది మూడో సారి. అయితే వివేకా చనిపోయిన రోజు అసలు ఏం జరిగింది? అనే దానిపై ఈ ముగ్గురినీ ఇవాళ సునీత సమక్షంలోనే సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా, గత ఏడాది మార్చి 15న వివేకా దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే.