ఓటుకు నోటు కేసు.. కీలక ఆదేశం !

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు వివరాలకు సంబంధించిన సీడీలు, హార్డ్ డిస్కులను సమర్పించాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. సాక్షుల విచారణ షెడ్యూల్ ఖరారు నిమిత్తం తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. ఈ కేసులో విచారణకు శుక్రవారం రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహా వ్యక్తిగతంగా హాజరయ్యారు.

దేశంలో ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను సత్వరమే విచారించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ న్యాయస్థానం ఈ కేసులో నిందితులు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని గతంలో ఆదేశాలిచ్చింది. ఈ కేసులో ఈ నెల 16న నిందితులపై అభియోగాలు నమోదు చేయడం తెలిసిందే. నిందితులపై సెక్షన్ 12 నమోదుతో పాటు ఐపీసీ 120బి రెడ్ విత్ 34 కింద అభియోగాలు నమోదు చేశారు.

Spread the love