ఒంగోలులో వ్యభిచారం.. గుట్టు రట్టు !

ఒంగోలులో వ్యభిచార ముఠా గుట్టురట్టయింది. ఓ గృహంలో వ్యభిచార దందా సాగిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడులు చేసిన పోలీసులు ఆశ్చర్యానికి గురై దృశ్యాలను అక్కడ చూసారు. విటులలో ప్రభుత్వాధికారులు, పోలీసులు ఉండటం గమనార్హం.

ఏఆర్ కానిస్టేబుల్ కూడా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే అక్కడ సెక్స్ రాకెట్ నడుపుతున్న ఇద్దరు విటులతో పాటు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. విటులలో ఒకరైన ఏఆర్ కానిస్టేబుల్‌ను సైతం పోలీసులు అరెస్టు చేశారు.. సోమవారం రిమాండ్ కు తరలించనున్నట్లు తెలుస్తుంది. కానిస్టేబుల్ ను వీధుల నుంచి తొలగించినట్లు తెలుస్తుంది.