వరంగల్ బావి ఘటన.. వారిది హత్యే !

వరంగల్‌ జిల్లా గొర్రెకుంటలో 9 మంది వలస కార్మికుల మృతిపై మిస్టరీ వీడుతోంది. వీరిది హత్యనేనని ఫోరెన్సిక్ నిపులుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంకా రిపోర్ట్ రావాల్సి ఉంది. మృతదేహాలను ఈడ్చుకెళ్లినట్లు పోరెన్సిక్ నిపుణులు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహంపై బలమైన గాయాలున్నాయని తెలిపారు. నాలుగు పురుష మృతదేహాలపై గాయాలున్నాయని వెల్లడించారు.

చిన్నపిల్లవాడిపై తప్ప అందరి మీద గీకుడు గాయాలున్నాయని తెలిపారు. ఏడు మృతదేహాల ఊపరితిత్తుల్లో నీరు చేరినట్లు చెప్పారు. బిల్డింగ్ పై నుంచి తోసేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. మహిళలపై అత్యాచారం జరిగిందా ? లేదా ?? అనేది ఫోరెన్సిక్ నివేదికలో తేలనుది. బతికి ఉండగా లేకపోతే నిద్రలో ఉన్నప్పుడు వారిని బావిలో పడేసినట్లు అనుమానం ఉందని..ఈ విషయాన్నే పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.