‘మైండ్ బ్లాక్’ చేయలేను : వార్నర్

ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ టిక్ టాక్ వీడియోలతో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఆయన తెలుగు సినిమాలపై.. అందులోనూ స్టార్ హీరోల సినిమాలపై పడిపోయారు. ఇటీవల ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘బుట్టబొమ్మ’, ‘రాములో రాములా’ పాటలకు తన భార్యతో కలిసి వార్నర్ డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత ‘పోకిరి’ చిత్రంలోని ‘ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను’ అనే డైలాగ్ చెప్పాడు. తాజాగా బాహుబలి చిత్రం నుంచి ‘అమరేంద్రం బాహుబలి అను నేను’ అనే డైలాగ్‌తో వార్నర్ టిక్‌-టాక్ చేశాడు. ఈ నేపథ్యంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలోని మైండ్ బ్లాక్ సాంగ్ కి స్టెప్పులేయాలని నెటిజన్స్ వార్నర్ ని కోరుతున్నారు. దీనిపై వార్నర్ స్పందిస్తూ.. నేను మైండ్ బ్లాక్ చేయలేను. ఎందుకంటే.. ? అది ఆస్ట్రేలియాలో యాప్‌లో అందుబాటులో లేదు. ఒకసారి అందుబాటులోకి వస్తే.. నేను మైండ్‌బ్లాక్ చేస్తాను” అంటూ వార్నర్ ట్వీట్ చేశాడు.