నీటి లెక్క తేలింది

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి లెక్కలు తేలాయి. హైదరాబాద్ జలసౌధలో జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. బోర్డు యాజమాన్య చైర్మన్‌ ఆర్‌.కె.గుప్తా నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మే 31వ తేదీ వరకు రెండు రాష్ట్రాలకి 66:34 నిష్పత్తిలో నీటి కేటాయింపులు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.

కృష్ణా జలాలు తెలంగాణకు 140 టీఎంసీలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌కు 84 టీఎంసీలు కేటాయించారు. అదనపు 45 టీఎంసీలను పరిగణలోకి తీసుకోవాలని తెలంగాణ కోరింది. అదేవిధంగా గృహవినియోగ జలాలను 20 శాతం పరిగణలోకి తీసుకోవాలని కోరింది. ఈ విషయాన్ని సీడబ్ల్యూసీకి నివేదించనున్నట్లు ఆర్.కె గుప్తా తెలిపారు.