అసలు హైదరాబాద్ లో ఏం జరుగుతోంది

అసలు హైదరాబాద్ లో ఏం జరుగుతోంది ? అంటే.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలని ఎవరైనా చెబుతారు. ఇప్పుడీ ఇదే ప్రశ్నని సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క వేశారు. జేపీ నేతల మాటలు దారుణంగా ఉన్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక పార్టీ అధ్యక్షుడుగా ఉన్న బండి సంజయ్ చేసే వ్యాఖ్యలు ఇవేనా? అని ప్రశ్నించారు.

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పీవీ, ఎన్టీఆర్ ఘాట్‌లను కూల్చేస్తానని అంటున్నారని.. అసలు హైదరాబాద్‌లో ఏం జరుగుతోందన్నారు. కరోనా, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని.. ఆ సమస్యలపై మాట్లాడకుండా ఎవరికి వారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్దారు. బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్ మూడూ ఒక్కటేనని భట్టి విక్రమార్క విమర్శించారు.

Spread the love