వాట్సాప్ కీలక ప్రకటన

ఫేస్‌బుక్‌తో డేటా షేరింగ్ విషయంలో వాట్సాప్ కొత్తగా తీసుకువచ్చిన ప్రైవసీ పాలసీపై విమర్శలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత సమాచార గోప్యతపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల మంది వాట్సాప్‌కి గుడ్‌బై చెప్పి… ఆల్టర్నేట్ యాప్స్ వైపు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రచారంపై వాట్సాప్ స్పందించింది.

ప్రజలు వ్యక్తిగతంగా ఒకరి నుంచి ఒకరు సమాచారం పొందడానికి వాట్సాప్‌ని గొప్ప వేదికగా మేం తయారుచేశాం. మేం చాలా స్పష్టంగా చెబుతున్నాం. కొత్తగా అప్‌డేట్ చేసిన ప్రైవసీ పాలసీ వల్ల… మీ ఎవరి వ్యక్తిగత ప్రైవసీపైనా ప్రభావం పడదు. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ సభ్యులు, ఇంకెవరికైనా మీరు పంపే మెసేజ్‌ల ప్రైవసీ దెబ్బతినదు. దానికి బదులుగా వాట్సాప్‌లో వ్యాపార కోణంలో పంపే మెసేజ్‌లకు అప్‌డేట్ వర్తిస్తుంది. ఇది కూడా ఆప్షనల్ మాత్రమే. మేం ఎలా డేటా సేకరిస్తామో, ఎలా దాన్ని వాడుతామో… మరింత పారదర్శకంగా వివరిస్తున్నామని తెలిపింది.

Spread the love