గాలిలో వైరస్‌ వ్యాప్తిపై WHO మరింత స్పష్టత

కరోనా వైరస్ గాలిలో కూడా వ్యాపిస్తోందన్న వాదనతో WHO అంగీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై WHO మరింత స్పష్టతనిచ్చింది. కొన్ని పరిస్థితుల్లో మాత్రమే ఇది సాధ్యమని స్పష్టం చేసింది. ముఖ్యంగా రెస్టారెంట్లు, బృందగానం చేసే ప్రదేశాలు, వ్యాయామ తరగతులు నిర్వహించే ప్రదేశాల్లో మాత్రమే వైరస్ గాలిలో వ్యాపించే అవకాశాలను అధ్యయనాలు సూచిస్తున్నాయని తెలిపింది.

ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే ఇండోర్ ప్రదేశాలు, ఎక్కువ వెంటిలేషన్ లేని ప్రాంతాల్లో వైరస్ సోకిన వ్యక్తుల నుంచి ఇది మరింతమందికి వ్యాపించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని తెలిపింది. వీటితోపాటు వైరస్ సోకిన వ్యక్తులు తిరిగిన ప్రదేశాలు లేదా ఇండోర్ ప్రదేశాల్లో ప్రజలు సన్నిహితంగా మెలగడం వల్ల వైరస్ వ్యాప్తిచెందే అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొంది.

Spread the love