కరోనాపై డబ్ల్యూహెచ్‌ఓ కీలక ప్రకటన

కరోనాపై డబ్ల్యూహెచ్‌ఓ కీలక ప్రకటన చేసింది. కరోనా వాక్సిన్ కోసం ఎదురు చూడొద్దు. ఉన్న మందులతో కరోనా కట్టడి కోసం ప్రయత్నాలు చేయాలని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ కోసం విశేష కృషి జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం ప్రాణాలను కాపాడటమే మన తక్షణ కర్తవ్యమని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గెబ్రెయేసస్ స్పష్టం చేశారు.

“తప్పు చేయెద్దు, వ్యాక్సిన్‌ పరిశోధనను మరింత వేగవంతం చేయాలి. ఈ సమయంలోనే ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న సాధనాలతోనే విస్తృతంగా కట్టడి చేయాలి. ఒకవేళ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ పంపిణీ చేసే కచ్చితమైన విధానం లేదని డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర విభాగాధిపతి మైక్‌ రేయాన్‌ స్పష్టం చేశారు.  ” అన్నారు.