మహిళల క్రికెట్‌ మినీ లీగ్  షెడ్యూల్ విడుదల

మహిళల క్రికెట్‌ మినీ లీగ్‌ షెడ్యూల్ ఖరారైంది.  యూఏఈ వేదికగా నవంబర్‌ 4 నుంచి 9 వరకు ఈ టోర్నీ జరగనుందని బీసీసీఐ తెలిపింది. గతేడాది మాదిరిగానే సూపర్నోవస్, ట్రైల్‌బ్లేజర్స్‌, వెలాసిటీ జట్లు తలపడనున్నాయి. ఈ జట్లకు హర్మన్‌ప్రీత్ కౌర్‌, మిథాలీ రాజ్‌, స్మృతి మంధాన నాయకత్వం వహించనున్నారు.

అయితే ఈ లీగ్‌లో థాయిలాండ్‌ నుంచి ఛాంతమ్‌ ప్రాతినిథ్యం వహించనుంది. ఆ దేశం నుంచి మినీలీగ్‌లో ఆడనున్న తొలి క్రికెటర్‌గా ఆమె రికార్డు సృష్టించనుంది. నాలుగు మ్యాచ్‌లతో సాగే ఈ లీగ్‌లో భారత క్రికెటర్లతో పాటు ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు పాల్గొంటున్నారని బీసీసీఐ సెక్రటరరీ జై షా వెల్లడించాడు.

షెడ్యూల్‌

4-11-2020 సూపర్నోవస్ × వెలాసిటీ

5-11-2020 వెలాసిటీ × ట్రైబ్లేజర్స్‌

7-11-2020 ట్రైబ్లేజర్స్‌ × సూపర్నోవస్‌

9-11-2020 ఫైనల్‌