క్లైమాక్స్ లో ఫేమస్ లవర్..

విజయ్ దేవరకొండ-క్రాంతి మాధవ్ కాంబినేషన్ కలయికలో కె ఎస్ రామారావు నిర్మిస్తున్న చిత్రం ‘ వరల్డ్ ఫేమస్ లవర్ ‘ . విజయ్ దేవరకొండ తొమ్మిదో సినిమా గా రాబోతున్న ఈ సినిమా ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ రొమాంటిక్ ట్ర‌యాంగిల్ ల‌వ్‌ ఎంట‌ర్ టైన‌ర్‌లో విజయ్ దేవరకొండ సరసన రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్‌, క్యాథెరిన్ థెరిస్సా, ఇజాబెల్లె దె హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైటెక్ సిటీ ఏరియాలో జరుగుతుంది. మరో వారం రోజులు పాటు షూటింగ్ జరుపుకోనున్న ఈ షెడ్యూల్ లో క్లైమాక్స్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. విజయ్ దేవరకొండతో పాటు ఇతర ప్రధానమైన నటీనటులు ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు.

ఇక ఈ మూవీ ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న లవర్స్ డే రోజున విడుదల చేయనున్నారు. ఓ పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం రాశీఖ‌న్నా మొదటసారి తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెబుతుంది. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు.