శాసనమండలిపై యనమల మాట

రాజ్యసభ శాస్వత సభగా ఉన్నప్పుడు శాసన మండలి కూడా ఉండాల్సిందేనని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. కేంద్రం ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేయాలని యనమల కోరారు. ప్రజాస్వామ్యంలో నియంతల నియంత్రణకు శాసన మండలి శాశ్వత సభగా ఉండాలని యనమల అన్నారు.

ప్రజా ప్రయోజనాల పరిరక్షణకు ఎగువ సభలు కీలకమని తెలిపారు. ప్రజాస్వామ్య నియంతలా మారిన జగన్‌ లాంటి నేతల కట్టడికి మండలి ఉండాల్సిందేనన్నారు. ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకే మూడు రాజధానులు, సీఆర్డీయే రద్దు బిల్లులను శాసనమండలి సెలెక్ట్‌ కమిటీకి పంపితే.. అందుకు రాష్ట్ర ప్రభుత్వమే సిద్ధంగా లేదన్నారు యనమల.