జగన్ న్యాయపోరాటంపై యనమల కామెంట్ 

ఏపీ సీఎం జగన్ న్యాయపోరాటం మొదలెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై తెదేపా విమర్శలు చేస్తోంది. జగన్ తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడన్నారు టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు. భస్మాసురుడిలా జగన్‌ రెడ్డి తన చెయ్యి తన నెత్తిపై పెట్టుకున్నాడన్నారు. శిక్షపడితే ఆరేళ్ల అనర్హత భయం జగన్‌ను వెన్నాడుతోందని.. పదేళ్ల శిక్ష పడితే 16 ఏళ్లు పోటీకి అనర్హుడు అవుతాడని యనమల అన్నారు.

ఈ 31 కేసులతో తన రాజకీయ జీవితం ముగిసి పోతుందనేది జగన్ భయమన్న యనమల.. అందుకే తప్పుల మీద తప్పులు, తప్పుడు పనులు చేస్తున్నారని మండిపడ్డారు. న్యాయవాద సంఘాలన్నీ జగన్ దుర్బుద్ధిని, రహస్య అజెండా బయట పెట్టాయని పేర్కొన్నారు. జగన్ తప్పటడుగులు, తప్పుడు పనులు ఏపీ భవిష్యత్తుకే అవరోధాలుగా అభివర్ణించారు. సీజేకు లేఖ ద్వారా జగన్ రెడ్డి సాధించింది ఏమిటని యనమల ప్రశ్నించారు.