కెజిఎఫ్ స్టార్ ..ఆర్ఆర్ఆర్ స్టార్ కలిశారు..

కెజిఎఫ్ చిత్రంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన కన్నడ స్టార్ హీరో యాష్..తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు కలుసుకున్నారు. చెన్నైలో ఆదివారం జరిగిన బిహైండ్ వుడ్ గోెల్డ్ మెడల్ అవార్డు కార్యక్రమంలో వీళ్లిద్దరు ఒకే వేదికపై కలసి సందడి చేసారు.

ఏడేళ్లుగా సౌత్ ఇండియా సినిమాలకు సంబంధించ బిహైండ్ వుడ్ ఈ అవార్డులు ప్రధానం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా అలాగే జరిగింది. ఈ వేడుకలో కేజీఎఫ్ సినిమాలో రాఖీ బాయి‌గా రఫ్పాడించిన యశ్‌ను సెన్సేషన్ ఆఫ్ సౌత్ ఇండియా అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డును ప్రముఖ క్రికెటర్ డ్వేన్ బ్రాన్‌ ఈ అవార్డును యశ్‌‌కు అందజేసాడు. ఈ వేడుకకు రామ్ చరణ్‌, విజయ్ దేవరకొండ‌తో పాటు మలయాళ ప్రేమమ్ ఫేమ్ నివిన్ పాల్ హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో స్టార్ హీరోలందరు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.

ప్రస్తుతం యాష్ కెజిఎఫ్ 2 తో బిజీ గా ఉండగా.. రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు.