జగనన్న ఆర్నెళ్ల పాలనపై షర్మిల షాకింగ్ కామెంట్స్

ఆంధ్రప్రదేష్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఆర్నేళ్లు పూర్తి చేసుకొన్నారు. 6 నెలలోనే మంచి ముఖ్యమంత్రి అనిపించుకొంటానని సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున జగన్ అన్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రజలు మాత్రం జగన్ పాలన బాగుంది అంటున్నారు. ప్రతిపక్ష నేతలు మాత్రం జగన్ ఆర్నేళ్ల పాలనపై నిప్పులు చెరుగుతున్నారు. సీఎం జగది రాక్షస పాలన అంటూ టీడీపీ యువ నేత నారా లోకేష్ విమర్శించిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు మాత్రం జగన్ పాలన భేష్ అని కితాబిస్తున్నారు.

తాజగా జగనన్న ఆర్నెళ్ల పాలనపై ఆయన చెల్లలు షర్మిల స్పందించారు. ఆరునెలలుగా ఏపిలో జగన్‌ చేపట్టిన అనేక సంక్షేమ పథకాలని ప్రస్తావిస్తూ షర్మిల ఓ వీడియోను ట్వీట్‌ చేశారు. అందులో ఆరోగ్యశ్రీ, ఫించన్ల పథకం, వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్‌ దిశగా అడుగులు, మత్స్యకార పథకం, చదువుల విప్లవం, మద్యపాన నిషేధం వంటి అనేక అంశాలు ఇందులో ఆమె ప్రస్తావించారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వానికి మీ చల్లని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని, రాష్ట్ర ప్రగతికి వేస్తున్న ప్రతి అడుగులో మీరంతా అండగా నిలవాలని కోరుకుంటున్నానని షర్మిల తెలిపారు.