వైఎస్ఆర్ స్నేహితుడు సడెన్ డెత్

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న తెనాలి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రావి రవీంద్రనాథ్ చౌదరి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ లోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందారు.

వైఎస్ కి రావిరవీంద్రనాథ్ చౌదరి అత్యంత సన్నిహితుడు. ఆయనతో కలిసి ఎంబీబీఎస్ చదివారు. ఇక వైఎస్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చిన రావి కాంగ్రెస్ నుండి తెనాలి ఎమ్మెల్యేగా, రెండు సార్లు తెనాలి మున్సిపల్ ఛైర్మన్‌ గానూ పని చేశారు. రేపు తెనాలిలో రవీంద్రనాథ్ అంత్యక్రియలు జరగనున్నాయి.