రైతుల వైఎస్ఆర్ జయంతి కానుక

వైఎస్సార్‌ జయంతి పురస్కరించుకుని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వైఎస్సార్‌ రైతు దినోత్సవ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని రైతులకి సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని 5 సహకార చక్కెర కర్మాగారాల పరిధిలో రైతులకు గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 54.6 కోట్ల రూపాయల పాత బకాయిలను విడుదల చేశారు.

విజయవాడలోని స్వరాజ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణానికి రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ రైతులు, ఇతర అధికారులతో మాట్లాడారు. వైఎస్‌ అంటే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, 108 అంబులెన్స్‌లు గుర్తుకొస్తాయని.. ఇప్పుడు వైఎస్సార్‌ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు.

Spread the love