వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి.. సీఎం జగన్ కుటుంబం ఇడుపులపాయకి వెళ్లింది. అక్కడ వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద వైఎస్ ఆర్ కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తండ్రి సమాధి వద్ద సీఎం జగన్ కాసేపు ప్రార్థనలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి ఇతర కుటుంబసభ్యులతో పాటు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, రవీంద్రనాథ్‌ రెడ్డి, అమర్‌నాథ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.