పార్లమెంట్’లో వైసీపీ వ్యూహాం ఇదే !

సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయ్. ఈ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాంపై వైసీపీ ఎంపీలు కసరత్తు చేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని పార్లమెంట్ వేదికగా డిమాండ్ చేయనున్నారు.

మరోవైపు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి పెండింగ్ లో ఉన్న అన్ని ప్రాజెక్టులను ఆమోదించుకునేలా చేసుకోవాలని వైసీపీ ప్లాన్ చేతున్నది. పోలవరంతో సహా అన్ని పెండింగ్ లో ఉన్న అంశాలపై ఒత్తిడి తెచ్చేందుకు వైసీపీ సిద్ధం అవుతున్నది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి వరుసగా వినతిపత్రాలు ఇవ్వాలని వైసీపీ ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు. పోలవరం విషయంలో సవరించిన అంచనాలను ఆమోదించాలని కేంద్రాన్ని కోరబోతున్నారు.