13 నెలల్లో రూ.4,770 కోట్లు ఇచ్చాం : జగన్

13 నెలల కాలంలో ప్రజలకి రూ.4,770 కోట్లు ఇచ్చామని ఏపీ సీఎం జగన్ అన్నారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళల్లో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారికి వర్తించే ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ పథకాన్ని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ”అభివృద్ధి, సంక్షేమమే అజెండాగా పాలన సాగిస్తున్నాం. అర్హులైన కాపు మహిళలకు ఏటా రూ.15వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తాం. తొలి ఏడాదిలో రూ. 354 కోట్ల ఖర్చుతో దాదాపు 2.36లక్షల మంది కాపు మహిళలకు లబ్ధి కలగనుంది. అర్హులందరికీ న్యాయం చేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం” అన్నారు.