హైదరాబాద్ వర్షాలపై యువరాజ్ కామెంట్

భారీ వర్షాలతో భాగ్యనగరం నడిసిముద్దైంది. ఈ నేపథ్యంలో పలువురు హైదరాబాద్ వర్షాలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. తెలంగాణ వరద బీభత్సం పై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందిస్తూ విచారం వ్యక్తం చేశాడు. త్వరలో వరదల బీభత్సం తగ్గి పరిస్థితులు సద్దుమణుగుతాయి అంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలు తగ్గుముఖం పట్టాలని దేవుని ప్రార్థిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. వరదల్లో సహాయం చేసేందుకు ఫ్రంట్లైన్ వారియర్స్ ఎంతో అద్భుతంగా పని చేస్తున్నారని ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇక ఈ రోజు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఫోన్ చేసి.. మాట్లాడిన సంగతి తెలిసిందే. వర్షాలు, సహాయక చర్యలపై వాకాబు చేశారు. కేంద్రం నుంచి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. మరోవైపు హైదరాబాద్ లో ని పలు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు.