నిర్మలమ్మని కలిసిన టీటీడీ చైర్మన్

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. తిరుమల ఆలయ భద్రత కోసం నియమించిన స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్ (ఎస్‌పిఎఫ్‌) విభాగానికి 2014, ఏప్రిల్ 1 నుంచి 2020 జూన్ 30వ తేదీ వరకు బకాయి ఉన్న రూ. 23.78 కోట్ల జీఎస్‌టీని రద్దు చేయాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు.

స్వామివారి భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించిన రూ.500/-, రూ.1000/- నోట్లను రిజర్వు బ్యాంకులో గానీ లేదా ఏ ఇతర బ్యాంకుల్లోనైనా డిపాజిట్ చేయడానికి అనుమతించాలని వైవి.సుబ్బారెడ్డి ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌కు విన్నవించారు. టీటీడీ వద్ద నిల్వ ఉన్న ఈ నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా లభించే సొమ్ముతో మరిన్ని ధార్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహించవచ్చని చెప్పారు.